News September 7, 2025

సంగీత దర్శకుడు BNR మన కొలకలూరు వారే

image

తెలుగు సినిమా సంగీత దర్శకులు భీమవరపు నరసింహరావు (బి.ఎన్.ఆర్.) గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొలకలూరులో జన్మించారు. జనవరి 24, 1905న జన్మించిన ఆయనకు 8 ఏళ్ల వయసు నుంచే సంగీతంపై ఆసక్తి కలిగింది. ఆయన మొదటి సినిమా సతీ తులసి (1936), ఆఖరి చిత్రం అర్ధాంగి (1955). సెప్టెంబర్ 7, 1976న ఆయన మరణించారు. ఆయన తెలుగు సినిమా సంగీతానికి ఎనలేని సేవలు అందించారు.

Similar News

News September 8, 2025

CBI పేరుతో రూ.62.25 లక్షలు ఫ్రాడ్

image

గుంటూరు భారతపేట ప్రాంతానికి చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ పేరుతో రూ.62.25 లక్షలు టోకరా వేశారు. సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే క్లియరెన్స్ కోసం రూ.62.25 లక్షలు కట్టాలనడంతో నగదు చెల్లించాడు. అయినా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూనే ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 8, 2025

GNT: వృద్ధురాలిపై అత్యాచారం

image

బాపట్ల పరిధిలోని నగరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన యువకుడు తన స్నేహితులతో కలిసి ఈనెల 1వ తేదీ రాత్రి మద్యం తాగాడు. ఆ తర్వాత మత్తులో తనకు నానమ్మ వరుసయ్యే 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. బంధువులు గమనించి వృద్ధురాలిని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి తరఫున నగరం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు అందగా ఎస్ఐ భార్గవ్ కేసు నమోదు చేశారు.

News September 8, 2025

గుంటూరు జీజీహెచ్‌లో 500 పడకల బ్లాకు

image

గుంటూరు జీజీహెచ్‌లో మాతా, శిశు వైద్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.86 కోట్లతో నిర్మిస్తున్న 500 పడకల బ్లాకులో వైద్య పరికరాల కొనుగోలుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ చర్యలతో గర్భిణులు, నవజాత శిశువుల మరణాలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.