News September 7, 2025
వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యకళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం నిత్యకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారిని పూలమాలతో అద్భుతంగా అలంకరించి నిత్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తూ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News September 8, 2025
WGL: ప్రారంభమైన మార్కెట్.. తగ్గిన పత్తి ధర..!

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,580 ధర పలకగా.. నేడు(సోమవారం) రూ.7,530కి తగ్గింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
News September 8, 2025
మధ్యాహ్నం 2గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పవనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రకటించనున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
News September 8, 2025
GNT: వృద్ధురాలిపై అత్యాచారం

బాపట్ల పరిధిలోని నగరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన యువకుడు తన స్నేహితులతో కలిసి ఈనెల 1వ తేదీ రాత్రి మద్యం తాగాడు. ఆ తర్వాత మత్తులో తనకు నానమ్మ వరుసయ్యే 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. బంధువులు గమనించి వృద్ధురాలిని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి తరఫున నగరం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు అందగా ఎస్ఐ భార్గవ్ కేసు నమోదు చేశారు.