News September 7, 2025
ప్రశాంతంగా ముగిసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు: ఎస్పీ

ప్రశాంతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సహకరించిన గణపతి మండపాల నిర్వాహకులకు, హిందూ సంఘాలు, మిలాద్ ఉన్ నబీ కమిటీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్విరామంగా 11 రోజుల పాటు శ్రమించిన పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామన్నారు. రాత్రింబవళ్లు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సిబ్బంది పని చేశారన్నారు.
Similar News
News September 9, 2025
NZB: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియామకం

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియమితులయ్యారు. ఈ అవకాశం కల్పించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించి పార్టీ ఎదుగుదలకు శాయశక్తులా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
News September 9, 2025
KNR: మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శం

నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. హుస్సేనీపురా బొంబాయి స్కూల్ నుంచి రాజీవ్ చౌక్ కరీముల్లాషా దర్గా వరకు ర్యాలీ తీశారు. తెలంగాణ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన పండుగ వేడుకల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మతపెద్దలు ప్రసంగిస్తూ మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శమన్నారు.
News September 9, 2025
నేపాల్‌లో సోషల్ మీడియా యాప్‌లపై నిషేదం ఎత్తివేత

సోషల్ మీడియా యాప్‌లపై నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా యాప్‌ల నిషేధంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అక్కడి యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో 19 మంది మరణించగా, 250 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.