News September 7, 2025

ప్రశాంతంగా నిమజ్జనం.. అభినందించిన సీఎం

image

TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. 9 రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Similar News

News September 8, 2025

DRDO-CHESSలో 25 పోస్టులు

image

హైదరాబాద్‌లోని DRDOకు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్(CHESS)లో 25 అప్రెంటిస్ పోస్టులున్నాయి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమా పాసై ఉండాలి. అభ్యర్థుల మార్కుల శాతం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు ఈ నెల 22 చివరి తేదీ. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9వేలు, టెక్నీషియన్అప్రెంటిస్‌లకు రూ.8వేలు స్టైఫండ్ ఇస్తారు. వెబ్‌సైట్: drdo.gov.in

News September 8, 2025

LIC హౌసింగ్‌లో 192 ఖాళీలు

image

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 192 అప్రెంటిస్ ఖాళీలకు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై, 20-25 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.12వేలు స్టైఫండ్ అందుతుంది.
వెబ్‌సైట్: <>www.lichousing.com<<>>

News September 8, 2025

భారత్‌పై అమెరికా టారిఫ్స్ సరైనవే: జెలె‌న్‌స్కీ

image

భారత్‌పై అమెరికా సుంకాలు విధించడం సరైనదేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రష్యాతో డీల్ కొనసాగిస్తున్న దేశంపై టారిఫ్స్ విధించడం మంచి ఐడియానే’ అని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ ముగింపునకు ఇతర దేశాలతో కలిసి కృషి చేస్తున్న భారత్‌పై జెలెన్‌స్కీ తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ కూడా ఆయనతో పలుమార్లు ఫోన్‌లో <<17582171>>మాట్లాడిన<<>> విషయం తెలిసిందే.