News September 7, 2025
కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు ప్రజలకు సూచించారు. ఈనెల 8న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News September 8, 2025
పాల దంతాలు వస్తున్నాయా?

పసిపిల్లలకు 7-9 నెలల నుంచి పాలదంతాలు వస్తాయి. ఈసమయంలో తల్లిదండ్రులు కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పళ్లు రావడం మొదలయ్యాక మృదువైన బ్రష్‌తో శుభ్రం చెయ్యాలి. చిగుళ్ల దురద, నొప్పి రాకుండా తడిపి, ఫ్రిజ్‌లో పెట్టిన శుభ్రమైన క్లాత్‌ని పిల్లలకు నోట్లో పెట్టుకోవడానికి ఇవ్వాలి. దంతాలు వస్తున్నపుడు పిల్లలకు జ్వరంతోపాటు మోషన్స్ వస్తాయి. ఇవి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
News September 8, 2025
ఇంట్లోనే బాడీ లోషన్ తయారీ

చర్మఆరోగ్యం కోసం అమ్మాయిలు బాడీలోషన్స్ వాడతారు. వీటి కోసం చాలా ఖర్చు చేస్తుంటారు. ఇలాకాకుండా వీటిని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. రెండు స్పూన్ల కలబంద, బీస్ వ్యాక్స్, బాదం ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్‌ను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మరిగించాలి. ఈ లోషన్ సువాసనభరితంగా ఉండాలంటే కాస్త ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకోవచ్చు. దీన్ని నిల్వ చేసుకుని చర్మానికి అప్లై చేస్తే చాలు. చర్మం అందంగా మారడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది.
News September 8, 2025
హెన్నా పెట్టుకుంటే జుట్టు పొడిబారిందా?

జుట్టు తెల్లబడితే చాలామంది హెన్నా పెడతారు. దీంతో కొన్నిసార్లు జుట్టు పొడిబారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే.. హెన్నాకు ఆమ్లా పౌడర్, పెరుగు, గుడ్డు తెల్లసొన మిక్స్ చేసి తలకు పెట్టుకోవాలి. అలాగే ఆమ్లా ఆయిల్, బాదం నూనె కూడా కలపొచ్చు. ఒకవేళ జుట్టు పొడిబారితే అరటిపండు, కలబంద, 2 స్పూన్ల ఆయిల్ కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని జుట్టుకు అప్లై చేసి అరగంట ఉంచాలి. తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది.