News September 7, 2025
కర్నూలు: నర్సింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 2025-26 విద్యాసంవత్సరానికి GNM నర్సింగ్ కోర్సులకు రాష్ట్రంలోని ప్రభుత్వ, నర్సింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. నర్సింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో 22వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తారన్నారు.
Similar News
News September 8, 2025
నేడు కర్నూలుకు వైఎస్ షర్మిల

ఉల్లి, టమాటా ధరల పతనంతో నష్టపోతున్న రైతులకు మద్దతుగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు కర్నూలుకు రానున్నారని కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ షేక్ జిలానీ బాషా తెలిపారు. ఉదయం 11 గంటలకు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పార్టీ శ్రేణులు ఆమెకు స్వాగతం పలుకుతారని పేర్కొన్నారు. అనంతరం కొత్త బస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డులో రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుంటారని చెప్పారు.
News September 8, 2025
ఈనెల 9న కర్నూలు జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీలు

ఈనెల 9న ఉదయం 10 గంటలకు కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లాస్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో సెపక్ తక్రా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం కార్యదర్శి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీల్లో ఉరవకొండలో (సబ్ జూనియర్స్) అలాగే 27, 28 తేదీల్లో ఒంగోలులో (సీనియర్స్) విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
News September 7, 2025
కర్నూలు యోగా జట్టుకు మూడో స్థానం

ద్వారక తిరుమల వేదికగా ఈ నెల 6, 7 తేదీలలో నిర్వహించిన 50వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో కర్నూలు జిల్లా జట్టు పాల్గొని 25 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచినట్లు రాష్ట్ర యోగ సంఘం ఛైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో సాధన చేసి పథకాల సాధించడం గర్వకారణమని అన్నారు. జిల్లా అధ్యక్షుడు అవినాశ్ శెట్టి, సెక్రెటరీ ముని స్వామి హర్షం వ్యక్తం చేశారు.