News September 7, 2025
NZB: జెండా బాలాజీ జాతరలో TPCC అధ్యక్షుడు

నిజామాబాద్ గోల్ హనుమాన్ ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న జెండా బాలాజీ జాతరలో TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం పాల్గొన్నారు. జెండా, ఉత్సవ మూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ పండితులు మహేష్ కుమార్ గౌడ్ కు ఆశీర్వచనం అందించారు.
Similar News
News September 8, 2025
NZB: రెండు కార్లు ఢీ

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడ వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ (M) నీలా గ్రామానికి చెందిన బలిరాం కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు భైంసాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శివాజీ, బలీరాం కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బలిరాంతో పాటు వర్నికి చెందిన అనసూయ, నవీపేట చెందిన అనురాధకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
News September 7, 2025
నిజామాబాద్‌లో చంద్రగ్రహణం

నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 8:58 గంటలకు పెనుమంట్ర దశతో ప్రారంభమైంది. పాక్షిక గ్రహణం రాత్రి 9:57 గంటలకు మొదలైంది. సంపూర్ణ గ్రహణం 12:22 గంటలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుందని జ్యోతిష పండితులు తెలిపారు.
News September 7, 2025
నిజామాబాద్: SRSP 8 వరద గేట్ల ఓపెన్

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు 8 స్పిల్వే వరద గేట్లను ఓపెన్ చేశారు. వాటి ద్వారా 25 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 52,840 క్యూసెక్కుల నీరు వస్తుండగా వరద గేట్లు, ఇతర కాల్వల ద్వారా 53,685 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.