News September 7, 2025

ఉల్లి రైతులను అడ్డం పెట్టుకొని వైసీపీ డ్రామాలు ఆడుతోంది: మంత్రి టీజీ

image

ఉల్లి రైతులను అడ్డం పెట్టుకొని వైసీపీ డ్రామాలు ఆడుతోందని మంత్రి టీజీ భరత్ ఫైర్ అయ్యారు. ఉల్లి ధరల విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని రూ.1,200కు కొనాలని ఇదివరకే చెప్పారన్నారు. వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలు మానుకోవాలని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో సమస్యలుంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరిస్తుందన్నారు. ఏమి లేకున్నా ఏదో జరిగిపోయినట్లు చెప్పడంలో వైసీపీ నేతలు ముందుంటారన్నారు.

Similar News

News September 9, 2025

అభివృద్ధి పనుల్లో జాప్యం తగదు: మంత్రి

image

కర్నూలు నగర అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, ప్రజలకు ప్రత్యక్షంగా కనబడేలా ప్రగతి పనులు వేగవంతం చేయాలని మంత్రి టి.జి భరత్ స్పష్టం చేశారు. సోమవారం కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలసి మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కేఎంసీ మలుపు విస్తరణ, కిడ్స్ వరల్డ్ కూడలి నుంచి బుధవారపేట బ్రిడ్జి వరకు రహదారి విస్తరణ పనుల జాప్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

News September 9, 2025

కర్నూలు: లైంగిక వేధింపుల చట్టంపై పోస్టర్ ఆవిష్కరణ

image

కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మహిళలపై లైంగిక వేధింపులు చట్టంపై అవగాహన కల్పించే పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య సోమవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల భద్రత, గౌరవం, హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు అమలు చేస్తోందని తెలిపారు. లైంగిక వేధింపులు జరిగినప్పుడు మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని వివరించారు.

News September 8, 2025

వైసీపీ నేతలు అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారు: మంత్రి

image

CM చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తుందని, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని మంత్రి టి.జి భరత్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కర్నూలులో ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన సులభతర వాణిజ్య కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక వైసీపీ నాయ‌కులు త‌ప్పుడు వార్త‌లు రాయిస్తున్నారని ఆయన అన్నారు.