News September 7, 2025
నడిగూడెం: కారు ఢీకొని వ్యక్తి మృతి

నడిగూడెం మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామానికి చెందిన బానోతు సేవ్య(65) ఆదివారం ఉదయం ముకుందాపురంలో కూరగాయలు అమ్ముకొని తిరిగి ఇంటికి వెళుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని మనవడు సాయి భరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Similar News
News September 8, 2025
సిద్దిపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి: BJP

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని BJP రాష్ట్ర అధ్యక్షుడు N.రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడిని ఆయన నివాసంలో కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించినట్లు తెలిపారు. అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు.
News September 8, 2025
ఢిల్లీలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిని కలిసిన మెదక్ ఎంపీ

ఢిల్లీలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను సోమవారం మెదక్ MP రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తాను రాసిన పుస్తకాలను MP రఘునందన్ రావుకు అందించారు. MP మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిని కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. తాను రాసిన పుస్తకాలను అందించిన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
News September 8, 2025
రూ.94వేల కోట్లలో రూ.250 కోట్లు నష్టం: కేటీఆర్

కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై దుష్ప్రచారం చేస్తోందని KTR విమర్శించారు. ‘మేడిగడ్డను రెండేళ్లుగా పక్కనబెట్టారు. కాళేశ్వరం కోసం రూ.94వేల కోట్లు ఖర్చు అయితే మేడిగడ్డలో ఒక బ్లాక్ కుంగి రూ.250 కోట్ల నష్టం జరిగింది. దాన్ని మేమే రిపేర్ చేస్తామని ఏజెన్సీ ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించట్లేదు’ అని ఫైరయ్యారు. ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లిస్తున్నారని తెలిపారు.