News September 7, 2025

HYD: పదేళ్లు కాంగ్రెస్‌‌ను అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నా: మహేశ్ కుమార్

image

పదేళ్ల తర్వాత పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని పదేళ్ల పాటు అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నానని MLC, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ HYDలో అన్నారు. KCRను గద్దె దించేందుకు ప్రత్యేక స్ట్రాటజీ అమలు చేశామని, CM రేవంత్‌ రెడ్డికి,తనకు కెమెస్ట్రీ బాగా కుదిరిందన్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఏకీకృతమవుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు నడుపుతున్నామన్నారు.

Similar News

News September 8, 2025

ఆందోల్: నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి

image

మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ఆందోల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ మేరకు పలు రోడ్లకు ఆయన శంకుస్ధాపన చేశారు. టేక్మల్ మండలంలోని తెలంగాణ మోడల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. బోధన జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ సాయిలు ఉన్నారు.

News September 8, 2025

JGTL: ‘పెట్రోల్ పంప్ ఏర్పాటుకు సహకరించండి’

image

జగిత్యాల పట్టణంలో ఓల్డ్ బస్టాండ్ సమీపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఏర్పాటు ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎస్పీ అశోక్ కుమార్‌ను కోరారు. ఈ విషయంపై ఆయన వినతిపత్రం అందజేశారు. పోలీస్ క్వార్టర్స్ స్థలాన్ని వాణిజ్యపరంగా వినియోగిస్తే వచ్చే ఆదాయంతో శాఖ అభివృద్ధి చేయవచ్చని జీవన్ రెడ్డి సూచించారు. ఇది ప్రజలకు కూడా ఉపయోగపడుతుందన్నారు.

News September 8, 2025

JGTL గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన సదస్సు

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో JGTL గురుకులంలో విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మిషన్ శక్తి, జిల్లా మహిళా సాధికారత బృందం ఈ 10 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భవానీనగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ సదస్సు నిర్వహించింది. రుతుక్రమం సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలను నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.