News September 7, 2025

GNT: గ్రహణం రోజు దర్భలు ఎందుకు వాడతారో తెలుసా..?

image

దర్భలు ఎంతో పవిత్రమైనవి. సూర్య,చంద్ర గ్రహణాలు ఏర్పడిన సమయంలో చాలా మంది దర్భలను తమ ఇళ్లకు తీసుకు వెళుతుంటారు. ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్న కారణంగా ఈ సమయంలో రాహువు చెడు దృష్టి, చంద్రుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. చంద్రుని కిరణాలు, రాహువు చెడు దృష్టి పడినప్పటికీ ఎలాంటి నష్టం కలుగకుండా ఆహార పదార్థాలపై దర్బలు వేసి ఉంచుతారని పండితులు చెబుతారు.

Similar News

News September 8, 2025

IASల బదిలీ.. TTD ఈవోగా సింఘాల్

image

ఏపీ ప్రభుత్వం 11 మంది IAS అధికారులను <>బదిలీ<<>> చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌, GAD సెక్రటరీగా శ్యామలారావు, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబు, ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముకేశ్ కుమార్ మీనా, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, హెల్త్ సెక్రటరీగా సౌరవ్ గౌర్‌ను నియమించింది.

News September 8, 2025

‘ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో’ పోస్టర్ ఆవిష్కరణ

image

భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో-2025 పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ ఎక్స్‌పో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని నార్సింగ్‌లోని ఓం కన్వెన్షన్ హాల్‌లో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఆధునిక కెమెరాలు, డ్రోన్లు, లెన్స్‌లు, ప్రింటింగ్ పరికరాలు, సాఫ్ట్‌వేర్లను ప్రదర్శిస్తామని వారు పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్లకు మంచి అవకాశమని ఎస్పీ అభిప్రాయపడ్డారు.

News September 8, 2025

రంప: ‘DRPలు తప్పనిసరిగా హాజరు కావాలి’

image

రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో 11మండలాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ రేపటి నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తప్పనిసరిగా హాజరు కావాలని ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు సోమవారం మీడియాకు తెలిపారు. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 9,10 తేదీల్లో వీరందరికి శిక్షణ ఉంటుందన్నారు. 11మండలాల్లో 44 మంది DRPలకు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అనే అంశం‌పై శిక్షణ ఇస్తారని తెలిపారు.