News September 7, 2025
ఘట్‌కేసర్: జులూస్‌లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ డేవిడ్ గుండెపోటుతో మృతిచెందాడు. నిన్న విధులు ముగించుకొని మల్కాజిగిరి ఆనంద్‌బాగ్ విష్ణుపురి కాలనీలోని ఇంటికి వెళ్లాడు. సాయంత్రం కాలనీ వినాయకుడి ఊరేగింపులో డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. ఉదయం 4 గంటలకు అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News September 9, 2025
HYD: మోత మోగిన కరెంట్ బిల్లు.. హీటర్ కారణమే

గ్రేటర్ HYD పరిధి తార్నాక, మల్లాపూర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట సహా అనేక ప్రాంతాల్లో వాటర్ హీటర్లతో మీటర్ల రీడింగ్‌లు గిర్రుమని తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కరెంటు బిల్లు రాగా, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం ఉన్నవారికి 200 యూనిట్లు దాటింది. దీంతో కరెంటు బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి. పలువురికి రీడింగ్ ఎక్కువగా రావటానికి కారణాలు పరిశీలిస్తే, అనేక మంది అత్యధికంగా వాటర్ హీటర్లు వాడినట్లు తేలింది.
News September 9, 2025
ఉప రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారంటే..

ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. మనదగ్గర MLC ఓటింగ్ మాదిరే ఉంటుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటో ప్రాధాన్యత ఓటు వేయాలి. తర్వాత ఇష్టమైతే మరో అభ్యర్థికి రెండో ప్రాధాన్యత వేయొచ్చు. అయితే NDA, INDI కూటమి రెండో ప్రాధాన్యత ఓటు వేయొద్దని తమ ఎంపీలకు ఇప్పటికే స్పష్టం చేశాయి. అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.
News September 9, 2025
HYD: కీర్తి పురస్కారాలు-2024.. 48 మంది ఎంపిక

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఏటా నిర్వహించే కీర్తి పురస్కారాలకు 2024 సంవత్సరానికి గాను 48 మందిని ఎంపిక చేసినట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు సోమవారం Way2Newsతో తెలిపారు. VC ఆచార్య వెలుదండ నిత్యానందరావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసిందని, ఈనెల 23, 24న నాంపల్లిలోని ఎన్టీఆర్ కళామందిరంలో ఎంపికైన వారిని సత్కరిస్తామన్నారు.