News September 7, 2025

జగిత్యాల: ‘రైతులు ఆందోళన చెందొద్దు’

image

జగిత్యాల జిల్లాలో ఈ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 6,37,177 బస్తాల యూరియాను పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ అధికారి వి.భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనివారం(నిన్న) వరకు 15,315 బస్తాల యూరియా నిల్వ ఉండగా, నేడు(ఆదివారం) మరో 15,100 బస్తాల యూరియా జిల్లాకు చేరుకుంటుందని అన్నారు. యూరియా కోసం రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

Similar News

News September 9, 2025

డిమాండ్‌లు నెరవేర్చకపోతే కాలేజీలు మూసివేస్తాం: APPDCMA

image

AP: పెండింగ్‌లో ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేదంటే కాలేజీలను నిరవధికంగా మూసివేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. 2023-24, 2024-25 అకడమిక్ ఇయర్స్‌కు సంబంధించిన ఫీజులు పెండింగ్‌లో ఉండటం వల్ల యాజమాన్యాలపై భారం పడుతోందని పేర్కొంది. కోర్సుల ఫీజులను కూడా సవరించాలని, 2014-19లో ఉన్న విధానాలను అమలు చేయాలని కోరింది.

News September 9, 2025

HYD: మోత మోగిన కరెంట్ బిల్లు.. హీటర్ కారణమే

image

గ్రేటర్ HYD పరిధి తార్నాక, మల్లాపూర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట సహా అనేక ప్రాంతాల్లో వాటర్ హీటర్లతో మీటర్ల రీడింగ్‌లు గిర్రుమని తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కరెంటు బిల్లు రాగా, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం ఉన్నవారికి 200 యూనిట్లు దాటింది. దీంతో కరెంటు బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి. పలువురికి రీడింగ్ ఎక్కువగా రావటానికి కారణాలు పరిశీలిస్తే, అనేక మంది అత్యధికంగా వాటర్ హీటర్లు వాడినట్లు తేలింది.

News September 9, 2025

ఉప రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారంటే..

image

ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. మనదగ్గర MLC ఓటింగ్ మాదిరే ఉంటుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటో ప్రాధాన్యత ఓటు వేయాలి. తర్వాత ఇష్టమైతే మరో అభ్యర్థికి రెండో ప్రాధాన్యత వేయొచ్చు. అయితే NDA, INDI కూటమి రెండో ప్రాధాన్యత ఓటు వేయొద్దని తమ ఎంపీలకు ఇప్పటికే స్పష్టం చేశాయి. అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.