News September 7, 2025

మేఘాద్రి గడ్డలో పడి ఇద్దరు యువకులు మృతి

image

మేఘాదిగడ్డ రిజర్వాయర్లో ఆదివారం ఇద్దరు యువకులు మృతి చెందారు. కార్మికనగర్, JNRM కాలనీకి చెందిన యువకులు చేపలు పట్టడానికి రిజర్వాయర్‌కి వచ్చారు. కింద పడిన చెప్పు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. వీరిలో బెల్లంకి శేఖర్, లక్ష్మణ్ కుమార్ చనిపోయారు. మరో యువకుడు వాసును స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు.

Similar News

News September 8, 2025

ఆసియాకప్ విజేతలు వీరే..

image

1984 నుంచి 2023 వరకు 14 సార్లు వన్డే, రెండు సార్లు టీ20 ఫార్మాట్లలో జరిగిన ఆసియాకప్‌లో అత్యధిక సార్లు టీమ్ ఇండియా(8) విజేతగా నిలిచింది. శ్రీలంక ఆరు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజయం సాధించాయి. ఈ సారి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లోనే ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. చివరగా వన్డే ఫార్మాట్‌లో జరగగా రోహిత్ సారథ్యంలో భారత జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది.

News September 8, 2025

ఎచ్చెర్ల: ప్రారంభమైన పీజీ ప్రవేశాల ప్రక్రియ

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ కె. రజిని ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, రుసుము చెల్లించాలని ఆమె పేర్కొన్నారు. 20న సీట్లు కేటాయింపు జరుగుతుందని తెలియజేశారు.

News September 8, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ముడి పదార్థాల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వేను పూర్తి చేయాలన్నారు.