News September 7, 2025
జగిత్యాలలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం

జగిత్యాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జిల్లా కలెక్టర్‌తో కలిసి ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారని మంత్రి కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయులు తమ సేవలకు గుర్తింపు పొందినందుకు అభినందనలు తెలిపారు.
Similar News
News September 8, 2025
ఎచ్చెర్ల: ప్రారంభమైన పీజీ ప్రవేశాల ప్రక్రియ

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ కె. రజిని ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, రుసుము చెల్లించాలని ఆమె పేర్కొన్నారు. 20న సీట్లు కేటాయింపు జరుగుతుందని తెలియజేశారు.
News September 8, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ముడి పదార్థాల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వేను పూర్తి చేయాలన్నారు.
News September 8, 2025
దాతలు ముందుకు రావాలి: KMR కలెక్టర్

ఈ నెల 9వ తేదీన ఎల్లారెడ్డిలో వరద బాధిత కుటుంబాలకు 150 కిట్లను, బాన్సువాడలో 150 కిట్లను అందజేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఆపద సమయంలో ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకుంటున్నందుకు సంస్థలకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మరింత కొంత మంది దాతలు ముందుకు వచ్చి వరద భాదితులను ఆదుకోవాలని కోరారు.