News September 7, 2025

WGL: పోలీస్ అధికారులకు అభినందనలు

image

గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించినందుకు పోలీసులకు, ఇతర ప్రభుత్వ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించినందుకు గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో శ్రమించిన ప్రతి ఒక్కరి పనిని ఆయన అభినందించారు.

Similar News

News September 8, 2025

HYD: ఈ కేసు వారి పరిధిలో ఉంటుంది: డీసీఏ

image

చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబరేటరీస్ డ్రగ్స్ వ్యవహారం తమ పరిధిలోకి రాదని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు స్పష్టం చేశారు. వాగ్దేవి ల్యాబ్స్ ఒక కెమికల్ ఫ్యాక్టరీ అని, దానికి ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేదని తెలిపారు. వారు తయారు చేసిన ‘మెఫిడ్రోన్’ అనే పదార్థం అసలు ఔషధమే కాదని వెల్లడించారు. ఈ కేసు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డీఆర్ఎ పరిధిలో ఉంటుందని డీసీఏ అధికారులు తెలిపారు.

News September 8, 2025

వెంకటగిరి పోలేరమ్మ జాతరకు కలెక్టర్‌కు ఆహ్వానం

image

వెంకటగిరి పోలేరమ్మ జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను సోమవారం కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌కు ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

News September 8, 2025

మున్నేరులో యువకుల గల్లంతు.. ఒకరి మృతి

image

కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కోసం మున్నేరుకు వెళ్లిన నలుగురు యువకుల్లో ఇద్దరు సోమవారం గల్లంతయ్యారు. వీరిలో కుద్దుస్ మృతదేహం లభ్యం కాగా, ఫారూక్ అనే మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.