News September 7, 2025
ఈనెల 9న కర్నూలు జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీలు

ఈనెల 9న ఉదయం 10 గంటలకు కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లాస్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో సెపక్ తక్రా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం కార్యదర్శి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీల్లో ఉరవకొండలో (సబ్ జూనియర్స్) అలాగే 27, 28 తేదీల్లో ఒంగోలులో (సీనియర్స్) విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
Similar News
News September 9, 2025
స్కూల్ గేమ్స్ అండర్ 19 షెడ్యూల్ విడుదల

కర్నూలు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 19 బాల బాలికల ఎంపిక పోటీల షెడ్యూల్‌ను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాఘవేంద్ర సోమవారం విడుదల చేశారు. DSA అవుట్ డోర్ స్టేడియంలో 10వ తేదీ ఆర్చరీ, ఘాట్కా, సెపక్ తక్ర 11న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫుట్ బాల్, DSAలో 12న ఫెన్సింగ్, కురాశ్ , ఉషూ 13న సైక్లింగ్, కరాటే, మాల్కంబ్‌తోపాటు మరికొన్ని అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News September 9, 2025
కర్నూలులో హత్య కేసును ఛేదించిన పోలీసులు

కర్నూలులో జరిగిన షేక్ ఇజహర్ అహ్మద్ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు DSP బాబు ప్రసాద్ తెలిపారు. నిందితుల నుంచి 3 కత్తులు, స్కూటీ స్వాధీనం చేసుకున్నామన్నారు. పాత గొడవల కారణంగా ఇమ్రాన్, ఇర్ఫాన్, షేక్ జాహీన్ అహ్మద్, ఎస్‌ఎండీ ఇర్ఫాజ్, యూసుఫ్ కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. ఇమ్రాన్, ఇర్ఫాన్, షేక్ జాహీన్ అహ్మద్‌ను అరెస్టు చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.
News September 9, 2025
అభివృద్ధి పనుల్లో జాప్యం తగదు: మంత్రి

కర్నూలు నగర అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, ప్రజలకు ప్రత్యక్షంగా కనబడేలా ప్రగతి పనులు వేగవంతం చేయాలని మంత్రి టి.జి భరత్ స్పష్టం చేశారు. సోమవారం కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలసి మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కేఎంసీ మలుపు విస్తరణ, కిడ్స్ వరల్డ్ కూడలి నుంచి బుధవారపేట బ్రిడ్జి వరకు రహదారి విస్తరణ పనుల జాప్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.