News September 7, 2025

నిజామాబాద్: బాస్కెట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి నరేష్

image

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు బొబ్బిలి నరేష్ బాస్కెట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా సేవలందించాడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన్ను ఎన్నుకున్నారు. 30 ఏళ్లుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో సేవలు అందించడంతో ఈ అవకాశం వచ్చిందన్నారు. ఆయన్ను పలువురు అభినందించారు.

Similar News

News September 8, 2025

NZB: అల్లు కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు

image

సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం పరామర్శించారు.
హాస్యనటుడు పద్మశ్రీ డా.అల్లు రామ లింగయ్య సతీమణి అల్లు కనక రత్నమ్మ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. కనక రత్నమ్మ చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి, కుటుంబానికి ధైర్యం చెప్పారు.

News September 8, 2025

NZB: ఈ నెల 10న తుది ఓటరు జాబితా

image

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న వెలువరించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News September 8, 2025

NZB: రెండు కార్లు ఢీ

image

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడ వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ (M) నీలా గ్రామానికి చెందిన బలిరాం కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు భైంసాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శివాజీ, బలీరాం కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బలిరాంతో పాటు వర్నికి చెందిన అనసూయ, నవీపేట చెందిన అనురాధకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.