News September 7, 2025
రానున్న 2గంటల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, హన్మకొండ, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. పిడుగులు పడే ఆస్కారం ఉన్నందున చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది.
Similar News
News September 9, 2025
జూబ్లీహిల్స్ బరిలో గోపీనాథ్ సతీమణి?

TG: మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. BRS సెంటిమెంట్‌గా గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. మాగంటి సునీత గోపీనాథ్ పేరిట నిత్యం పోస్టులు చేస్తున్నారు. మరోవైపు తన ఇద్దరు కూతుళ్లు అక్షర, దిశిరను జనాల్లోకి పంపుతున్నారు. వారు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ మమేకమవుతున్నారు.
News September 9, 2025
దేశంలో అత్యధిక మరణాలు ఈ వ్యాధితోనే!

మన దేశంలో (2021-2023) అత్యధిక మంది గుండె జబ్బుల (31%) వల్లే మరణిస్తున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సర్వే తెలిపింది. ఆ తర్వాత 9.3% మంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, 6.4% మంది కణజాల సమస్యలు, 5.7% మంది శ్వాసకోశ వ్యాధులు, 4.9% మంది జ్వరాలు, 3.7% మంది గాయాలు, 3.5% మంది షుగర్ వ్యాధితో చనిపోతున్నట్లు వివరించింది. 15-29 ఏళ్ల మధ్యవారు ఎక్కువగా ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నట్లు తెలిపింది.
News September 9, 2025
ఈ అల్పాహారం ఆరోగ్యానికి మేలు!

ఇడ్లీ, దోశ, ఉప్మా: పులియబెట్టిన పిండితో చేస్తారు కాబట్టి వీటిలో పోషకాలు, విటమిన్స్ ఎక్కువ.
పెసరట్టు, ఆమ్లెట్, మొలకలు: వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల ఆరోగ్యానికి, ఆకలి నియంత్రణకు సహాయపడుతుంది.
రాగి జావ, ఓట్స్: వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
పండ్లు, నట్స్, పెరుగు: వీటిలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
* పోషకాలు సమృద్ధిగా ఉండే అల్పాహారాన్ని తినడం మంచిది.