News September 7, 2025
పిడుగుపాటుతో 30 మేకలు మృత్యువాత

వేపాడ మండలం కొండగంగుబూడిలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి 30 మేకలు మృతి చెందాయి. వర్షానికి మేకలన్ని చెట్టు దగ్గరికి చేరడంతో పిడుగుపాటుకు గురయ్యాయి. నంది రమేశ్, గలారి పదసాహెబ్, సార ఎర్రయమ్మ సార బుచ్చమ్మకి చెందిన జీవాలు కొండపైన మరణించడంతో జీవనోపాధి కోల్పోయామంటూ వారు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
Similar News
News September 9, 2025
VZM: మరో ఇద్దరు టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు

కూటమి ప్రభుత్వం నాలుగు కార్పొరేషన్లకు సంబంధించి 51 మంది డైరెక్టర్లను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా విజయనగరం జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. విజయనగరం నియోజకవర్గం నుంచి కెల్ల అప్పలనాయుడు(టీడీపీ), గజపతినగరం నుంచి బండారు సాయి లక్ష్మి (టీడీపీ)కి అవకాశం ఇచ్చింది.
News September 9, 2025
VZM: జిల్లాలో 5వేల ఎకరాల్లో IT పార్కుల ఏర్పాటు

IT పార్కుల స్థాపనకు సుమారు 5వేల ఎకరాల భూమిని సేకరించనున్నట్లు కలెక్టర్ అంబేద్కర్ సోమవారం ప్రకటించారు. త్వరలోనే భూసేకరణ ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే భోగాపురం జాతీయ రహదారికిరువైపులా 200 మీటర్ల పరిధిలో సుమారు 754 ఎకరాలను గుర్తించామన్నారు. వీటిలో 20 ఎకరాలకు పైబడిన స్థలాలను గుర్తించామన్నారు. వీటిలో 100 ఎకరాలు పైబడిన 3 బ్లాకులు ఉన్నాయన్నారు. స్థలాలు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.
News September 9, 2025
సుజల స్రవంతి భూ సేకరణను వేగవంతం చేయండి: కలెక్టర్

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు భూ సేకరణపై తమ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్.కోట, వేపాడ, కొత్తవలస మండలాల పరిధిలోని 4 గ్రామాల్లో 108 ఎకరాలు, బొండపల్లి మండలంలోని 3 గ్రామాల పరిధిలో 126 ఎకరాల భూసేకరణపై చర్చించారు. ఈ గ్రామాల రైతులతో త్వరలో సమావేశం నిర్వహించి ధర ఖరారు చేయాలన్నారు.