News September 7, 2025
జగిత్యాల: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

జగిత్యాల(D) మల్లాపూర్(M) ముత్యంపేటలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. టపాకాయలు పేలుస్తుండగా చిట్యాల అరవింద్ అనే యువకుడి కంట్లోకి ఒక టపాకాయ దూసుకెళ్లి తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా పేల్చుతున్నప్పుడు ఒకటి పేలకపోవడంతో దాన్ని పరిశీలించడానికి దగ్గరికి వెళ్లాడు. ఈ క్రమంలో టపాకాయ పేలి అందులోని నిప్పురవ్వ నేరుగా అతని కంట్లోకి దూసుకుపోవడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని నిజామాబాద్‌కు తరలించారు.
Similar News
News September 9, 2025
కరీంనగర్: ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యం

ఉమ్మడి KNRలో పలు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా డయాగ్నొస్టిక్స్, ల్యాబ్స్, మెడికల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా విజిటింగ్ డాక్టర్స్‌తో వైద్యం చేయిస్తున్నారు. ప్రమాణాలు పాటించని హాస్పిటల్స్‌పై అధికారులు తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. వైద్యం పేరుతో వేల ఫీజులు తీసుకుంటూ సరైన సేవలు అందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
News September 9, 2025
నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

ఏపీలో నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ మొదలుకానుంది. విద్యార్థులు ఈనెల 12వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 10నుంచి 13వరకు జరుగుతుంది. వెబ్‌ఆప్షన్ల నమోదు 13 నుంచి 15వరకు ఉండనుంది. వెబ్ ఆప్షన్స్ 16న ఎడిట్ చేసుకోవచ్చు. 18న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 19, 20న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.
News September 9, 2025
టీటీడీ పాలకమండలి సమావేశం రద్దు

రేపు జరగాల్సిన టీటీడీ పాలకమండలి సమావేశం రద్దు అయింది. ఈఓ శ్యామలరావు బదిలీతో రేపు బోర్డు సమావేశంతో పాటు ఇవాళ జరగాల్సిన విభాగాధిపతుల సమీక్షా సమావేశం కూడా రద్దు అయింది. 700 వేదపారాయణదారుల భర్తీ ప్రక్రీయను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడు అదేశాలతో అర్హులైన బ్రాహ్మణులకు న్యాయం జరిగేలా త్వరలో పారదర్శకంగా వేదపారాయణదారులు పోస్టులను భర్తీ చేయనున్నారు.