News September 7, 2025

ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్

image

AP: కర్ణాటకలోని ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని మంత్రి లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలభైరవేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి మఠం సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదిచుంచనగిరి మఠం నిర్వహించే సంవిత్ పాఠశాలలను పరిశీలించారు. APలో పేదల కోసం సంవిత్ బడులు ప్రారంభించాలని కోరగా, పీఠాధిపతి జగద్గురు శ్రీనిర్మలానందనాథ మహాస్వామిజీ అంగీకారం తెలిపారు.

Similar News

News September 8, 2025

8 కిలోల బరువు తగ్గిన హిట్‌మ్యాన్.. ఎలా అంటే?

image

ఫిట్‌గా మారేందుకు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 8 కిలోల బరువు తగ్గినట్లు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ ర్యాన్ ఫెర్నాండో తెలిపారు. ఐపీఎల్ తర్వాత 2-3 నెలల్లోనే డైట్, కఠోర సాధన చేసి వెయిట్ లాస్ అయినట్లు వెల్లడించారు. ఇందుకు ఆయన ఎలాంటి ఫ్యాషన్ డ్రగ్స్ వాడలేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కొందరు బరువు తగ్గేందుకు GLP-1 మందును వాడారు. కానీ హిట్‌మ్యాన్ మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదని పేర్కొన్నారు.

News September 8, 2025

స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం?

image

TG: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హైకోర్టును గడువు కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖరుతో కోర్టు ఆదేశించిన డెడ్‌లైన్ ముగియనుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఓటరు స్లిప్పులు కూడా తయారు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్ ఎన్నికలకు మరికొంత వ్యవధి కోరేందుకు సిద్ధమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

News September 8, 2025

విజయవాడలో వే2న్యూస్ కాన్‌క్లేవ్

image

వచ్చే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతోంది? ఈ అంశంపై వే2న్యూస్ కాన్‌క్లేవ్ నిర్వహిస్తోంది. అమరావతి (మంగళగిరి) CK కన్వెన్షన్‌లో ఈనెల 12న ఈ సదస్సు జరగనుంది. దేశంలో డిజిటల్ మీడియా సంస్థ తొలిసారి నిర్వహిస్తున్న ఈ కాన్‌క్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు సహా రాష్ట్ర ప్రముఖులు ఎందరో హాజరుకానున్నారు. ఇందులో ఏపీ@2035 లక్ష్యాలు, ఆలోచనలతో రోడ్ మ్యాప్ ప్రజెంట్ చేస్తారు.
Note: Invite Only Event