News September 7, 2025
సీఎం రేవంత్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ

TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కడియం శ్రీహరి మినహా మిగతావారు హాజరైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ తాను BRSలోనే ఉన్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భేటీ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ పలువురు MLAలకు నోటీసులివ్వగా ఒకరిద్దరు ఆయనకు సమాధానమిచ్చినట్లు సమాచారం.
Similar News
News January 21, 2026
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: కవిత

TG: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఏ పార్టీకి మద్దతు కావాలంటే ఆ పార్టీకి తెలంగాణ జాగృతి సపోర్ట్ చేస్తుందని తెలిపారు. కాగా కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రక్రియకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అటు ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
News January 21, 2026
సునీతా విలియమ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?

ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లొవీన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. 1998లో నాసాలో చేరిన ఆమె మొత్తం మూడుసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లారు. మొత్తంగా 608 రోజులు అంతరిక్షంలోనే ఉన్నారు. తొమ్మిదిసార్లు స్పేస్‌వాక్ చేశారు.
News January 21, 2026
173 బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(<


