News September 7, 2025
దెందులూరు: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

దెందులూరు రైల్వే స్టేషన్ సమీపంలోని సీతంపేట వద్ద రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. అతని శరీరం ముక్కలైపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. మృతుడు ఎరుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. ప్రమాదంలో సెల్‌ఫోన్ కూడా ధ్వంసమైంది. మృతుని వివరాలు తెలిసినవారు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 9, 2025
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు 8 గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 54,545 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 8 వరద గేట్ల ద్వారా 25000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్ అధికారులు దిగువకు వదులుతున్నారు. IFFC 19,000, కాకతీయ 5,500, ఎస్కేప్ 2,500, సరస్వతి 800, లక్ష్మి 200, అలీసాగర్ 360, గుత్ప 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తున్నారు. ప్రాజెక్టులో 1091 అడుగులకు నీటిమట్టం చేరుకోగా 80.501 TMC నీరుంది.
News September 9, 2025
విజయవాడ: బీచ్‌లో యువకుడి మృతి

విజయవాడ నుంచి బాపట్ల సూర్యలంక తీరానికి వచ్చిన యువకుడు అలల తాకిడికి గల్లంతై మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. విజయవాడ నుంచి వచ్చిన సాయి తీరంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతయ్యాడు. గల్లంతయిన యువకుడి కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు ప్రారంభించగా కాసేపటికి మృత దేహం లభ్యమైంది.
News September 9, 2025
కరీంనగర్: ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యం

ఉమ్మడి KNRలో పలు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా డయాగ్నొస్టిక్స్, ల్యాబ్స్, మెడికల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా విజిటింగ్ డాక్టర్స్‌తో వైద్యం చేయిస్తున్నారు. ప్రమాణాలు పాటించని హాస్పిటల్స్‌పై అధికారులు తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. వైద్యం పేరుతో వేల ఫీజులు తీసుకుంటూ సరైన సేవలు అందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.