News April 3, 2024
నల్గొండ: ఉరి వేసుకుని యువకుడి మృతి

కట్టంగూరు మండలం కురుమూర్తి గ్రామానికి చెందిన గుండెగోని హరిబాబు(27) తాగుడుకు బానిస అయ్యాడు. తల్లి లక్ష్మమ్మ హరిబాబును మందలించడంతో మనస్థాపం చెంది మంగళవారం ఇంటి నుంచి వెళ్లాడు. చెరువు అన్నారం గ్రామ శివారులో ఒక స్మారక స్థూపానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ అప్జల్ అలీ బుధవారం తెలిపారు.
Similar News
News April 9, 2026
NLG: ఊపందుకుంటున్న ధాన్యం కొనుగోళ్లు

జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్రమంగా ఊపందుకుంటోంది. ఇప్పటివరకు ప్రతిపాదించిన 422 కేంద్రాలకుగాను 166 కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వివిధ కొనుగోలు కేంద్రాలకు మొత్తం 1,42,995 మెట్రిక్ టన్నుల ధాన్యం చేరుకోగా, అందులో 154 మంది రైతుల నుంచి రూ.3.44 కోట్ల విలువైన 1,440 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.
News April 9, 2026
అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం: నల్గొండ ఎస్పీ

నల్గొండ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేసి, సీజ్ చేస్తున్నట్లు SP శరత్ చంద్ర పవార్ బుధవారం తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్పీ హెచ్చరించారు.
News April 9, 2026
NLG: జిల్లాకు 3,600 క్యాన్సర్ నివారణ టీకాలు

క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధానికి జిల్లా సిద్ధమైంది. ఇప్పటికే 3,600 హెచ్‌పీవీ వ్యాక్సిన్ యూనిట్లు చేరుకోవడంతో ఆడబిడ్డల ఆరోగ్య రక్షణకు గట్టి పునాది పడింది. మహిళల పాలిట శాపంగా మారిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు 14 నుంచి 15 ఏళ్ల వయసున్న సుమారు 20 వేల మంది కిశోర బాలికలకు ఈ టీకాలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఈ టీకాలు వేయించాలని వైద్య ఆరోగ్యశాఖ కోరింది.


