News September 7, 2025
HYD: మైనర్ బాలికపై అత్యాచారం

మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన సిటీ శివారులో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. శనివారం రాత్రి యాచారం మం. పరిధిలోని ఓ గ్రామంలో బాలికకు మాయమాటలు చెప్పిన ఇద్దరు యువకులు గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారు. ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. మరొకడు అత్యాచారానికి యత్నించాడు. ఆదివారం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం సిటీలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News September 8, 2025
ప్రజలిచ్చే అర్జీలపై సత్వరమే స్పందించాలి: HYD కలెక్టర్

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు అందచేసిన అర్జీలపై సత్వరమే అధికారులు స్పందించాలని HYD కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ముకుంద రెడ్డి, కదిరవన్ పలని తో కలసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి పరిష్కరించాలన్నారు.
News September 8, 2025
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం.. ఇది గమనించారా?

సాధారణంగా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం తర్వాత కొంతభాగం నీటిలో పైకి కన్పిస్తుంటుంది. అయితే ఈసారి బడా గణేశుడు పూర్తిగా నీటిలో నిమజ్జనమయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శనివారం నిమజ్జనానికి వచ్చిన భక్తులు ఆ భారీ గణనాథుడు కన్పిస్తాడేమోనని క్రేన్ నం.4 వద్ద ఇలా బారులు తీరారు. అయితే అక్కడ మండపంలో గణపయ్యకు వేసిన భారీ పూలదండ ఆకారం కన్పించడంతో దానిని వారు ఆసక్తిగా తిలకించారు. మ.2లోపు గణనాథుడు నిమజ్జనమయ్యాడు.
News September 8, 2025
HYD: తెలంగాణ విమోచన దినోత్సవ కరపత్రాలు విడుదల

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెల్లడించారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాంప్లెట్, స్టికర్‌ను ఆయన విడుదల చేశారు. విమోచన దినోత్సవం తెలంగాణ ప్రజల త్యాగానికి, స్వాభిమానానికి శాశ్వత చిహ్నంగా పేర్కొన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని కోరారు.