News September 7, 2025
జగిత్యాల కలెక్టరేట్ ముట్టడికి పిలుపు

పింఛన్ల పెంపు కోసం మంగళవారం జరగనున్న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని MRPS అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ పిలుపునిచ్చారు. నేడు జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, BD కార్మికులకు పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటికీ పెంచలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహిళల వివరాలను సేకరించారు.
Similar News
News September 9, 2025
విత్తన కొనుగోళ్లలో ఇవి ముఖ్యం..

సీల్ తీసి ఉన్న, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లో విత్తనాలను కొనరాదు. విత్తన తయారీ కంపెనీ, ప్రదేశం వివరాలను షాప్ యజమానిని అడిగి తెలుసుకోవాలి. విత్తనాలు కొనే సమయంలోనే తూకం వేసి తీసుకోవాలి. విత్తనం వల్ల పంట నష్టం జరిగితే రైతుకు కొనుగోలు రశీదులే కీలక ఆధారాలు. అందుకే పంటకాలం పూర్తయ్యేవరకు వాటిని రైతులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. పూత రానిపక్షంలో నష్టపరిహారం కోసం రసీదు అవసరం.
News September 9, 2025
సెప్టెంబర్ 15న సింహాచలం దర్శన సమయంలో మార్పులు

సింహాచలం వరహాలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో సెప్టెంబర్ 15న కృష్ణ జయంతి నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11:30 నుంచి 12:30 వరకు దర్శనాలు నిలిపివేశారు. అదేరోజు సాయంత్రం 6 గంటల నుంచి దర్శనాలు, ఆరాధన సేవ నిలిపివేసినట్లు ఈవో త్రినాథరావు తెలిపారు. సెప్టెంబర్ 16న సాయంత్రం 4:30 గంటలకు సింహాచలం రాజగోపురం వద్ద ఉట్ల ఉత్సవం నిర్వహించనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News September 9, 2025
మొక్కల్లో మాంగనీస్ లోప లక్షణాలు – నివారణ

మాంగనీస్ లోపం చీనీ, నిమ్మ తోటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీని వల్ల ఆకుల మీద పసుపు రంగు లేక పాలిపోయిన మచ్చలు ఏర్పడి క్రమంగా అవి తెల్లగా మారతాయి. ఆకులు కిందకు ముడుచుకొని బోర్లించిన గిన్నెలా అవుతాయి. ఆకులు మీద ఈ లోప చిహ్నాలను సులభంగా గుర్తించవచ్చు. నివారణ కోసం మాంగనీస్ సల్ఫేట్ 0.1 శాతం ద్రావణాన్ని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసి లోపాన్ని నివారించవచ్చు.