News September 7, 2025
ప్రతి ఒక్కరికీ అభినందనలు: ఆదిలాబాద్ ఎస్పీ

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి, భక్తి వాతావరణంలో 600 మంది పోలీసులతోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో నిమజ్జన ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం పేర్కొన్నారు. మరోవైపు ఇందుకు పలు సంఘాలు, కమిటీలు, మండప నిర్వాహకులు, యువత సహకారం అభినందనీయమని ఆయన తెలిపారు.
Similar News
News September 8, 2025
ADB: విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన సుగుణ

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సోమవారం జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలు తీరు, రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై అధిష్టానంతో సుగుణ వివరించారు.
News September 8, 2025
ఆదిలాబాద్: రైల్వే సమస్యలను పరిష్కరించాలి

ఆదిలాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్, ఫిట్ లైన్, ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్ కోరారు. ఈ మేరకు సోమవారం నాందేడ్ రైల్వే డివిజనల్ మేనేజర్ ప్రదీప్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు జనగం సంతోష్, కార్యదర్శి సుభాష్, అమర్ జార్జ్ పాల్గొన్నారు.
News September 8, 2025
రేపటి లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: DIEO

ఆదిలాబాద్ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానాన్ని డీఐఈఓ జాదవ్ గణేష్ కుమార్ ప్రారంభించారు. మొత్తం 6,274 మంది విద్యార్థులకు గాను 3,599 మంది (57 శాతం) మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మిగతా విద్యార్థులు ఈ నెల 9లోగా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.