News September 7, 2025
ఆదిలాబాద్: ‘ప్రధాని మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం’

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన ఎంపీల వర్క్ షాప్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించినట్లు నగేశ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 9, 2025
వెట్టిచాకిరి పోరాటమే జగిత్యాల జైత్రయాత్రకు పునాది

గ్రామాల్లో భూస్వాములు, పటేల్ పట్వారిలు ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకునేవారు. ఈ క్రమంలో కొండపల్లి సీతారామయ్య వర్గానికి చెందిన యువకులు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యపరిచి రైతుకూలీ సంఘాలను ఏర్పాటు చేశారు. ‘వెట్టిచాకిరి నిర్మూలన, పాలేరుకు జీతాలు పెంపు, దున్నేవాడిదే భూమి’ అంటూ వారిలో చైతన్యం రగిలించి వెట్టిచాకిరి బంద్ పెట్టించారు. వీటి విముక్తి కోసమే1979, Sep9న జగిత్యాల జైత్రయాత్ర పురుడు పోసుకుంది.
News September 9, 2025
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవుజీ

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ నియమితులయ్యారు. నంబాల కేశవరావు మరణం తర్వాత సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది. దేవుజీని నియమిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్‌గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది మేలో ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబాల మరణించారు.
News September 9, 2025
విజయవాడ: ‘ముగ్గురుని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయాడు’

సూర్యలంక సముద్ర తీరంలో విజయవాడకు చెందిన యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కథనం ..హైదరాబాదు నుంచి వచ్చిన ముగ్గురు సముద్రంలో స్నానం చేస్తుండగా కొట్టుకుపోవడంతో పక్కనే ఉన్న సాయి వారిని రక్షించబోయి అలల తాకిడికి గల్లంతయ్యాడు. గమనించిన పోలీసులు, గజ ఈతగాళ్లు కొట్టుకుపోతున్న ముగ్గురిని కాపాడారు. కాపాడాలనుకున్న సాయి శవమై తేలాడు. అయితే ప్రాణాలతో భయటపడ్డ ముగ్గురు వెంటనే వెళ్లిపోయినట్లు సమాచారం.