News September 7, 2025

HYD: గంగ ఒడికి చేరిన చిట్ట చివరి గణపతి ఇదే!

image

ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్ నిమజ్జన వేడుకలు ఆదివారం సాయంత్రం పూర్తయ్యాయి. GHMC ఆధ్వర్యంలో ప్రత్యేక క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు తెలిపారు. ‘చివరి గణేశ్ విగ్రహ నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. ట్రాఫిక్ నిర్వహణ సజావుగా సాగేలా సహకారం అందించిన పౌరులకు కృతజ్ఞతలు’ అంటూ పోలీసులు ట్వీట్ చేశారు. గంగ ఒడికి వచ్చిన చివరి గణపతితో ఫొటోలు దిగారు.

Similar News

News September 8, 2025

HYD: రోడ్డున పడేయలేదనా? రోడ్డుపై వదిలేశారు!

image

నగరవ్యాప్తంగా గణపయ్య ప్రతిమలను రోడ్లపైనే విక్రయించారు. ఆ విగ్రహాలను అమ్మి సొమ్ముచేసుకుని మిగిలిపోయినవి ఇలా ఎర్రగడ్డలో రోడ్లపైనే వదిలేశారు. లాభాలు ఇచ్చినందుకా ఇలా ఆయన బొమ్మలను రోడ్డుపై వదిలేశారని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సనత్‌నగర్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. DCM వ్యాన్‌లో వాటిని తీసుకెళ్లి బేబీవాటర్ పాండ్‌, IDL చెరువులో నిమజ్జనం చేశారు. సతీశ్, సాయి ప్రకాశ్, రణ్‌వీర్, బవేశ్ కార్తీక్ ఉన్నారు.

News September 8, 2025

‘దానం’ డిస్‌క్వాలిఫికేషన్ ఎపిసోడ్.. కాంగ్రెస్ ప్లాన్- బీ?

image

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు తప్పించేందుకు కాంగ్రెస్ ప్లాన్-బీ రచిస్తున్నట్లు సమాచారం. దానంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులతో అధిష్ఠానం చర్చించినట్లు తెలిసింది. ఈ విషయంపై గాంధీ భవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

News September 8, 2025

HYD: ఈ విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం: కవిత

image

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, బీసీలను మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల కోసం బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రిజర్వేషన్లు కల్పించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బీసీ సంఘాలను కలుపుకొని ముందుకు సాగనున్నట్లు తెలిపారు.