News September 7, 2025
వినాయక నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ పట్టణంలో వినాయక నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిన్నటి నుంచి నేటి రాత్రి వరకు నిమజ్జన ప్రక్రియ కొనసాగిందని, అధికారుల ముందస్తు చర్యల వల్ల వినాయక నిమజ్జన ప్రక్రియలో ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు కలగకుండా పూర్తయిందన్నారు. నిన్నటి నుంచి అధికారులంతా నిమజ్జన ప్రక్రియ మొత్తాన్ని దగ్గరుండి పర్యవేక్షించారని తెలిపారు.
Similar News
News September 8, 2025
యూరియా లోటు లేదని రైతులకు తెలియజేయాలి: కలెక్టర్

జిల్లాలో యూరియా లోటు లేదనే విషయాన్ని రైతులకు అర్థం అయ్యేలా తెలియజేయాలని కలెక్టర్ అంబేడ్కర్ సిబ్బందికి తెలిపారు. సోమవారం PGRS అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. మొదటి విడత పంపిణీ ఇంచుమించు పూర్తి చేసామన్నారు. 2వ విడత కూడా 30 శాతంపై బడి పూర్తి చేసామని వివరించారు. మిగిలినవి వారం లోగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. రెండో విడతకు ఇండెంట్ పెట్టామన్నారు. యూరియా వచ్చిన వెంటనే అందజేస్తామన్నారు.
News September 8, 2025
తొలి సౌత్ ఇండియా నటుడిగా బాలయ్య

ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో బెల్ మోగించిన తొలి సౌత్ ఇండియా నటుడిగా బాలకృష్ణ అరుదైన ఫీట్ అందుకున్నారు. ఇవాళ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రతినిధులతో ముంబై వెళ్లానని, అందులో భాగంగా NSEని సందర్శించానని పేర్కొన్నారు. NSE అధికారులు తన పట్ల చూపిన ఆత్మీయత, గౌరవం తన హృదయాన్ని తాకిందన్నారు. ప్రత్యేకంగా ఆహ్వానించి బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారని వివరించారు.
News September 8, 2025
మెదక్: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కరణం పరిణిత

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో మెదక్ నియోజకవర్గ నేతకు చోటు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత సోమశేఖర్ రావు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిణిత గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు.