News September 8, 2025
గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కన్నుమూత

నిర్మాత అల్లు అరవింద్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు(76) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం నాగరాజు అంత్యక్రియలు HYDలో జరిగాయి. అంతకుముందు దర్శకుడు రవిరాజా పినిశెట్టి, బన్నీ వాసు, బండ్ల గణేశ్ తదితరులు మృతదేహానికి నివాళులు అర్పించారు. కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్ తల్లి మరణించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 8, 2025
నేపాల్‌లో హింస.. హోంమంత్రి రాజీనామా

నేపాల్‌లో <<17651342>>హింసాత్మక ఘటనలు<<>> జరుగుతుండటంతో ఆ దేశ హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి పంపారు. సోషల్ మీడియా నిషేధంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అక్కడి యువత ఇవాళ ఆందోళనకు దిగింది. పోలీసులు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు. 250 మందికి పైగా గాయాలయ్యాయి.
News September 8, 2025
తొలి సౌత్ ఇండియా నటుడిగా బాలయ్య

ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో బెల్ మోగించిన తొలి సౌత్ ఇండియా నటుడిగా బాలకృష్ణ అరుదైన ఫీట్ అందుకున్నారు. ఇవాళ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రతినిధులతో ముంబై వెళ్లానని, అందులో భాగంగా NSEని సందర్శించానని పేర్కొన్నారు. NSE అధికారులు తన పట్ల చూపిన ఆత్మీయత, గౌరవం తన హృదయాన్ని తాకిందన్నారు. ప్రత్యేకంగా ఆహ్వానించి బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారని వివరించారు.
News September 8, 2025
రాష్ట్రానికి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

AP: సెప్టెంబర్ నెలకు సంబంధించి కేంద్రం నుంచి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘కాకినాడ పోర్ట్ నుంచి 17,294, మంగళూరు పోర్ట్ నుంచి 5,400, జైగర్ పోర్ట్ నుంచి 10,800, విశాఖ పోర్ట్ నుంచి 15,874 మెట్రిక్ టన్నుల యూరియా 2 రోజుల్లో రాష్ట్రానికి వస్తుంది. వ్యవసాయ అధికారుల సిఫారసు మేరకు మాత్రమే యూరియా వాడాలి. రైతులు ధైర్యంగా ఉండాలి’ అని సూచించారు.