News September 8, 2025
విశాఖ: ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో అగ్నిమాపక డీజీ సమీక్ష

అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ వెంకటరమణ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖలోని IIM క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో NOC జారీ ప్రక్రియ సులభతరమైందని, కార్యాలయాలకు రాకుండా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పొందుతున్నారన్నారు. ఈ జోన్‌లో మరో ఆరు అగ్నిమాపక కేంద్రాలను రూ.2.25 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో రూ.13.9 కోట్లతో శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తామన్నారు.
Similar News
News September 8, 2025
అధికారులపై విశాఖ కలెక్టర్ ఆగ్రహం

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుపట్ల కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్‌లో గతవారం ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీ, పోలీసు శాఖ ఫిర్యాదుల్లో నాణ్యమైన పరిష్కారం దొరకడం లేదన్నారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంపై తరచూ ఫిర్యాదులు రావడంపై మండిపడ్డారు. ఇలాంటి తీరు పునరావృతం అయితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
News September 8, 2025
విశాఖ: సెప్టెంబర్ 10న స్థాయీ సంఘాల సమావేశం

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు సెప్టెంబర్ 10న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగనున్నాయని జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ జె.సుభద్ర ఆధ్వర్యంలో వి.సి.హాల్ సమావేశ మందిరంలో 1-7వ స్థాయీ సంఘాలు వేర్వేరుగా ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య జరుగుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.
News September 8, 2025
విశాఖ: బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు అరెస్ట్

విశాఖలోని సీతమ్మధార వద్ద మూగ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ద్వారకా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్సార్ నగర్‌లో తల్లిదండ్రులతో నివాసం ఉంటున్న బాలికపై ఆదివారం సాయంత్రం ఇద్దరు మైనర్లు అత్యాచారం చేశారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ద్వారకా పోలీసులు స్పందించి అత్యాచారం చేసిన ఇద్దరు బాలురను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.