News September 8, 2025
భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త

చిలమత్తూరులో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. మద్యం మత్తులో భార్య లక్ష్మిదేవి(35)తో వాగ్వాదానికి దిగిన రాఘవేంద్ర కోపోద్రిక్తుడై గొడ్డలితో నరికి హతమార్చాడు. రక్తమోడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. దంపతులకు ఇంటర్ చదువుతున్న ఒక కుమార్తె ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
Similar News
News September 8, 2025
రేపటి నుంచే ఆసియా కప్.. లైవ్ ఎక్కడ చూడాలంటే?

రేపటి నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగుతోంది. గ్రూప్-Aలో భారత్, పాక్, UAE, ఒమన్, గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లా, అఫ్గాన్, హాంకాంగ్ తలపడతాయి. దుబాయ్, అబుదాబి వేదికల్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచులు ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ 1, 3, 4, 5, సోని లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. గ్రూపు దశలో భారత్ 10, 14, 19 తేదీల్లో మ్యాచులు ఆడనుంది.
News September 8, 2025
భూపాలపల్లి: ‘షెడ్యూల్ తయారు చేయాలి’

మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన ‘స్వస్థ నారి-సశక్తి పరివార్’ అభియాన్ కార్యక్రమ నిర్వహణకు షెడ్యూల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ అభియాన్ ద్వారా దేశ వ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి, మహిళలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించనున్నారని కలెక్టర్ తెలిపారు.
News September 8, 2025
శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా చర్లపల్లి(CHZ)- సంత్రాగచ్చి(SRC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07221 CHZ- SRC రైలును SEPT 9 నుంచి NOV 29 వరకు ప్రతి మంగళ, శనివారాల్లో, నం.07222 SRC- CHZ రైలును SEPT 10 నుంచి NOV 30 వరకు ప్రతి బుధ, ఆదివారాల్లో నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.