News September 8, 2025
కామారెడ్డి: విద్యుత్ కార్యాలయంలో ప్రజావాణి

కామారెడ్డిలోని విద్యుత్ కార్యాలయంలో సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎన్‌పీడీసీఎల్ ఎస్ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని సబ్ డివిజన్, సెక్షన్, ఈఆర్‌ఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా స్థాయిలో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వినతులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News September 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 9, 2025
సెప్టెంబర్ 9: చరిత్రలో ఈ రోజు

1914: కవి కాళోజీ నారాయణరావు జననం (ఫొటోలో)
1935: కూచిపూడి నృత్య కళాకారుడు, రంగస్థల నటుడు వేదాంతం సత్యనారాయణ శర్మ జననం
1957: సినీ నటి జయచిత్ర జననం
1978: కవి, కథా రచయిత ఆలూరి బైరాగి మరణం
2003: భారత మాజీ క్రికెటర్ గులాబ్‌రాయ్ రాంచంద్ మరణం
☛ తెలంగాణ భాషా దినోత్సవం
News September 9, 2025
KNR: ప్రజావాణికి 300 దరఖాస్తులు..

ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి సోమవారం దరఖాస్తులు స్వీకరించారు. 300 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేసి, పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, DRO వెంకటేశ్వర్లు, RDOలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు.