News September 8, 2025
రైతులకు భరోసా కల్పించిన కలెక్టర్ లక్ష్మీశ

కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, మైలవరం, నందిగామ, పెనుగంచిప్రోలు మండలాల్లో పర్యటించి రైతులతో ముచ్చటించారు. యూరియా సరఫరా పరిస్థితులను స్వయంగా పరిశీలించి, ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణలో ఎరువులు అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు. అగ్రికల్చర్ అవుట్‌డోర్ కార్యక్రమంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.
Similar News
News September 9, 2025
రెబ్బన నుంచి బెల్లంపల్లికి అక్రమంగా ఇసుక రవాణా

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను మైనింగ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు రామ్ నరేశ్, సురేశ్ తెలిపిన వివరాలు.. రెబ్బన నుంచి బెల్లంపల్లికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు కన్నాల జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
News September 9, 2025
HYD: లా సెట్ 2వ దశ ప్రవేశాల షెడ్యూల్ ఖరారు

లా కోర్సుల్లో ప్రవేశాలకు రెండో దశ ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్ల ఎంపికకు షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 14న వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 15 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 17న ఎడిట్ చేసుకోవచ్చన్నారు. సీట్ల కేటాయింపు జాబితాను 22న విడుదల చేస్తామని పేర్కొన్నారు.
News September 9, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో 19 రోడ్డు ప్రమాదాలు: ఎస్పీ

ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 19 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపిన 3,124 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.