News April 3, 2024
విశాఖ: ‘వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు’

ఒకరు విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, మరొకరు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ యాదృచ్ఛికంగా సంపత్ వినాయగర్ ఆలయంలో కలుసుకున్నారు. పార్టీలను పక్కనపెట్టి ఒకరికొకరు కాసేపు ముచ్చటించుకుని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో తనను బలపరచాలని వాసుపల్లి విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 19, 2026
ఆర్కేబీచ్ రోడ్డులో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

ఆర్కేబీచ్ రోడ్డులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఫిషింగ్ హార్బర్ వైపు వెళ్తున్న బైకర్ డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2026
విశాఖ – భవానీపట్న రైలు రీషెడ్యూల్

ఇన్‌కమింగ్ రేక్ ఆలస్యం కావడంతో విశాఖ – భవానీపట్న ప్యాసింజర్ (58504) రైలు సమయాన్ని మార్చినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
News April 19, 2026
విశాఖ: చందనోత్సవం వేళ.. 185 వాటర్ స్టాల్స్

సింహాచలంలో స్వామివారికి జరుగబోయే చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో GVMC చేపడుతున్న ఏర్పాట్లను కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. భక్తుల కోసం 185 వాటర్ స్టాల్స్, 6000 బబుల్ వాటర్ క్యాన్లు, 40,000 వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశామన్నారు. 1,860 శానిటరీ సిబ్బంది, 600 డస్ట్ బిన్లు, 20 వాటర్ ట్యాంకర్లతో పాటు 372 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.


