News September 8, 2025
రాజమండ్రిలో నేడు యథాతథంగా పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

రాజమండ్రిలో నేడు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం యథాతదంగా జరగనుందని కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు నేరుగా సమర్పించుకోవచ్చుని అన్నారు. అర్జీలు ముందుగా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News September 9, 2025
యూరియా వాడకంపై అవగాహన కల్పించండి: కలెక్టర్

యూరియా అతి వినియోగం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి విస్తృత ప్రచార కార్యక్రమం ప్రారంభించాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ రూపొందించిన కొత్త యాప్‌ను రైతులందరూ ఉపయోగించుకునేలా చూడాలని, వాట్సాప్ సేవలను మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ సేవలపై రైతుల సంతృప్తి స్థాయి 30% మాత్రమే ఉందని ఆమె పేర్కొన్నారు.
News September 8, 2025
కంద రైతులకు గిట్టుబాటు ధరపై కలెక్టర్ సమీక్ష

తూర్పు గోదావరి జిల్లాలో కంద రైతులకు సరైన మార్కెట్ ధర లభించకపోవడంపై కలెక్టర్ పి. ప్రశాంతి సమీక్షించారు. సోమవారం రాజమండ్రిలో ఉద్యానవన, మార్కెటింగ్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కంద పంట ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్ వ్యవస్థలో సమతుల్యత తీసుకురావడానికి చర్యలు అవసరమని కలెక్టర్ తెలిపారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ఆమె సూచించారు.
News September 8, 2025
బిక్కవోలు: భార్య కాపురానికి రాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

భార్య కాపురానికి రాలేదని ఓ వ్యక్తి మనస్తాపం చెంది కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం బిక్కవోలులో జరిగింది. ఎస్సై రవివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బిక్కవోలుకు చెందిన రవికుమార్‌కు సోనితో వివాహమైంది. 3 నెలల కిందట భర్తపై కోపంతో మండపేటలోని ఆమె పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో రవి సామర్లకోట కాలువలో దూకాడు. అదే మార్గంలో వెళ్లున్న ఎస్సై, డ్రైవర్ అతనిని కాపాడారు.