News September 8, 2025

పెట్టుబడులతో రాష్ట్రానికి రండి: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని, పెట్టుబడులతో రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేశ్ కోరారు. కోయంబత్తూరులో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ‘పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నాం. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో రాష్ట్రానికి వచ్చాక నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మాదే’ అని పేర్కొన్నారు.

Similar News

News January 30, 2026

పచ్చదోమతో కందికి ముప్పు.. నివారణ ఎలా?

image

వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నపుడు కందిలో పచ్చదోమ ఉద్ధృతి పెరుగుతుంది. పచ్చదోమ పురుగులు కంది ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకులు పసుపుపచ్చగా మారి ముడుచుకొని దోనె లాగా కనిపిస్తాయి. తీవ్రత పెరిగితే ఆకులు ఎర్రబడి రాలిపోయి.. మొక్కల ఎదుగుదల, దిగుబడి తగ్గుతుంది. పచ్చదోమ నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 36% S.L 1.6ml లేదా డైమిథోయేట్‌ 30%E.C 2.2ml కలిపి పిచికారీ చేయాలి.

News January 30, 2026

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో ఉద్యోగాలు

image

<>సెంట్రల్<<>> ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ME/MTech, ఎకనామిక్స్/MBA/పబ్లిక్ పాలసీ, BE/BTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటరాక్షన్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. PROకు నెలకు రూ.1.10L-రూ.1.5L, ROకు రూ.64K-రూ.1.10L, RAకు రూ.45K-రూ.80K చెల్లిస్తారు. వెబ్‌సైట్: vacancy.cercind.gov.in

News January 30, 2026

కరుంగలి మాల ధరిస్తున్నారా? ఇలా చేయండి!

image

కరుంగలి మాలను ధరించే ముందు సరైన పద్ధతిలో శుద్ధి చేయడం ముఖ్యం. మొదట మాలను పచ్చి పాలలో ముంచి, ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. దీనివల్ల మాల పవిత్రత పెరుగుతుంది. మీ కులదైవం/ఇష్టదైవం ముందు ఉంచి పూజించిన తర్వాతే ధరించాలి. జపం, ధ్యానం చేసే సమయంలో దీనిని ఉపయోగించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మాంసాహారం తినేటప్పుడు లేదా అశుభ కార్యాలకు వెళ్లేటప్పుడు మాలను తీసివేయడం మంచిదని పెద్దలు సూచిస్తుంటారు.