News September 8, 2025

ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2కు శ్రీకారం

image

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌ ఫేజ్ 2, 3‌తో రూ.1,200 కోట్లతో ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2ను CM రేవంత్‌ ప్రారంభిస్తారు. GHMC, సిటీ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ORR పరిధి GPలకు నీటి సరఫరా అందించాలనేది దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా 71 రిజర్వాయర్లు నిర్మించగా.. ఇందులో కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను CM ప్రారంభించనున్నారు.

Similar News

News September 9, 2025

పీజీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు రెండో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్‌లో బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్లో చూసుకోవచ్చని సూచించారు.

News September 9, 2025

HYD: లా సెట్ 2వ దశ ప్రవేశాల షెడ్యూల్ ఖరారు

image

లా కోర్సుల్లో ప్రవేశాలకు రెండో దశ ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్ల ఎంపికకు షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 14న వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 15 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 17న ఎడిట్ చేసుకోవచ్చన్నారు. సీట్ల కేటాయింపు జాబితాను 22న విడుదల చేస్తామని పేర్కొన్నారు.

News September 9, 2025

బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. పరీక్షా ఫలితాల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.