News September 8, 2025
నేడు CPGET-2025 ఫలితాలు

TG: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET-2025) ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి రిజల్ట్స్‌ను విడుదల చేయనున్నారు. గత నెల 6 నుంచి 11వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షకు 45,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. CPGET <
Similar News
News September 9, 2025
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే..

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నీటితో పాటు కొబ్బరి నీళ్లు, లెమన్ వాటర్ వంటి పానీయాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ‘కొబ్బరి నీళ్లలోని పొటాషియం, ఎలక్ట్రోలైట్లు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. నిమ్మలోని సిట్రిక్ ఆమ్లం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. బార్లీ వాటర్ కిడ్నీ స్టోన్స్‌ను నివారిస్తుంది. గ్రీన్ టీ, క్రాన్బెర్రీ జ్యూస్ కిడ్నీలకు మేలు చేస్తాయి’ అని చెబుతున్నారు.
News September 9, 2025
పాక్‌ను తేలికగా తీసుకోం: భారత బౌలింగ్ కోచ్

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను తేలికగా తీసుకోబోమని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపారు. పాక్‌తో సవాలు కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని, ఆ జట్టు బలాలు, బలహీనతలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. తమ నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతామన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్/బౌలింగ్ చేసేలా ఆల్‌రౌండర్లకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాగా భారత్, పాక్ మ్యాచ్ ఈ నెల 14న జరగనుంది.
News September 9, 2025
నేపాల్‌లో సోషల్ మీడియా యాప్‌లపై నిషేదం ఎత్తివేత

సోషల్ మీడియా యాప్‌లపై నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా యాప్‌ల నిషేధంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అక్కడి యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో 19 మంది మరణించగా, 250 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.