News September 8, 2025
యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: MHBD కలెక్టర్

యూరియా పంపిణీ కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హెచ్చరించారు. జిల్లాలో యూరియా కేంద్రాల నిర్వహణ, యూరియా పంపిణీ శనివారం, ఆదివారం తీసుకున్న చర్యలపై కలెక్టర్ మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ సహకార శాఖ సంబంధిత సిబ్బందితో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రాల వద్ద పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 10, 2025
నేడు అనంతపురానికి డిప్యూటీ CM.. షెడ్యూల్ ఇదే!

★ బుధవారం ఉ.11.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో పుట్టపర్తికి బయలుదేరుతారు.
★ మ.12.30కి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు.
★ మ.12.40కి హెలికాప్టర్‌లో అనంతపురానికి బయలుదేరుతారు.
★ మ.1.00కి అనంతపురానికి చేరుకుంటారు.
★ మ.2-సా.4.30 వరకు ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్6-సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగం
★ సభ ముగిశాక పుట్టపర్తి విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి మంగళగిరికి వెళ్తారు.
News September 10, 2025
ఆ రైలుకు బేతంచెర్లలో స్టాపింగ్

కరోనా సమయంలో రద్దైన స్టాపింగ్‌లను ప్రయాణికుల సౌకర్యార్థం 137 స్టేషన్లలో పునరుద్ధరించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అందులో భాగంగా మచిలీపట్నం–యశ్వంత్‌పూర్ మధ్య నడిచే కొండవీడు రైలు (17211)కు ఈ నెల 10వ తేదీ నుంచి బేతంచర్ల స్టేషనులో రాత్రి 12:34 గంటలకు స్టాపింగ్ కల్పించారు. అదే విధంగా తిరుగు ప్రయాణం (17212)లో ఈ నెల 11వ తేదీ నుంచి బేతంచర్లలో రాత్రి 9:19 గంటలకు స్టాపింగ్ పునరుద్ధరించారు.
News September 10, 2025
టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధరలు నిర్ణయించాం: కలెక్టర్

సెప్టెంబర్ 10వ తేదీ నుంచి టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలోకు రూ.8గా, సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.7గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం వెల్లడించారు. మార్కెట్‌లో ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు విక్రయిస్తే, వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని రైతులకు సూచించారు. సంప్రదించాల్సిన నంబర్లు: 9573990331, 9030315951.