News September 8, 2025
రూ.298 కోట్లతో కోకాపేట లేఅవుట్ డెవలప్‌మెంట్

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3, ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2తో పాటు కోకాపేట లేఅవుట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు నేడు CM రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.298 కోట్లతో కోకాపేట లే అవుట్, నియోపొలిస్, స్పెషల్ ఎకనామిక్ జోన్(SEZ)లో తాగునీరు, నూతన మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కీలక ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.
Similar News
News September 10, 2025
ఇకపై ఓయూ విద్యార్థులకు ఏఐ, ఎంఎల్ నైపుణ్యాలు

ఓయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు AI, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ రంగాలలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏఐ లింక్ టెక్నాలజీస్ సంస్థతో ఓయూ ఇంజినీరింగ్ కళాశాల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులను అత్యాధునిక నైపుణ్యాలతో నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇరువర్గాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. JNTUHలో ఇప్పటికే ఈ పద్ధతిలో బోధిస్తున్నారు.
News September 10, 2025
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో క్యాన్సర్ కేర్ సెంటర్

మంత్రి దామోదర్ రాజనర్సింహ వర్చువల్‌గా 33 జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా గాంధీ ఆస్పత్రిలో పాలియేటివ్ కేర్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమం వర్చువల్‌గా జరిగింది. సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ప్రిన్సిపల్ డా.ఇందిర, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.సునీల్, RMO డా.శేషాద్రి, వైస్ ప్రిన్సిపల్ డా.రవిశేఖర్ రావు పాల్గొన్నారు.
News September 10, 2025
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు

దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ను పార్లమెంట్ భవన్‌లో మంగళవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కలిసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి.. క్రమశిక్షణ, అకుంఠిత దీక్షతో నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి ఇవాళ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు.