News September 8, 2025
పుంగనూరు: 601 టన్నుల యూరియా పంపిణీ

పుంగనూరు వ్యవ సాయశాఖ డివిజన్ పరిధి అన్ని మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా పంపిణీ చేస్తున్నట్లు ఏడీ శివకుమార్ తెలిపారు. పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, రొంపిచెర్ల, పులిచెర్లతో పాటు పెద్ద పంజాణి, గంగవరం మండలాల రైతులకు బయో మెట్రిక్ ద్వారా 601 టన్నుల యూరియాను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు తమ పాసుపుస్తకాలు, ఆధార్ జిరాక్స్ తో యూరియా పొందాలని సూచించారు.
Similar News
News September 9, 2025
చిత్తూరు జిల్లాలో తగ్గుతున్న అమ్మాయి సంఖ్య

చిత్తూరు జిల్లాలో లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసాలు ఆందోళన కలిగిస్తోంది. వెయ్యి మంది మగవారికి నగరిలో అత్యల్పంగా 873 అమ్మాయిలు ఉండగా, పలమనేరులో 894, కుప్పంలో 904, చిత్తూరులో 912 మంది అమ్మాయిలు ఉన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యత్యాసాలకు బాల్య వివాహాలు, గర్భంలో లింగ నిర్ధారణ, అబార్షన్లు ప్రధాన కారణమని భావించి వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
News September 9, 2025
ద్రావిడ వర్సిటీలో బి.టెక్ ప్రవేశాలకు దరఖాస్తులు

ద్రావిడ వర్సిటీలో 2025-26 ఏడాదికి బి.టెక్ (Bachelor of Technology) కోర్సులలో మూడో విడత ప్రవేశాలకు అడ్మిషన్స్ జరుగుతున్నట్లు రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ తెలిపారు. AP EAPCET-2025లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 11 అన్నారు. పీజీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచన్నారు.
News September 8, 2025
కాణిపాకం అభివృద్ధిపై TTDకి ప్రతిపాదనలు

కాణిపాకం అభివృద్ధిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సోమవారం ప్రతిపాదనలు అందజేశారు. కాణిపాకంలో కళ్యాణ మండపం, విశ్రాంతిభవన నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు అందజేసినట్టు ఎమ్మెల్యే, ఈవో పెంచల కిశోర్ తెలిపారు. అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.