News September 8, 2025

NZB: రెండు కార్లు ఢీ

image

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడ వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ (M) నీలా గ్రామానికి చెందిన బలిరాం కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు భైంసాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శివాజీ, బలీరాం కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బలిరాంతో పాటు వర్నికి చెందిన అనసూయ, నవీపేట చెందిన అనురాధకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Similar News

News September 9, 2025

NZB: మూడేళ్ల చిన్నారికి అరుదైన చికిత్స

image

NZBలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మూడేళ్ల చిన్నారికి అరుదైన గుండె ప్రొసీజర్ విజయవంతమైంది. పుట్టిన వెంటనే సహజంగా మూసుకుపోవాల్సిన రక్తనాళం తెరుచుకొని ఉండటంతో చిన్నారి తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. ఈ క్రమంలో వైద్యులు శస్త్రచికిత్స చేయకుండా ప్రత్యేక గుండె ప్రొసీజర్ ద్వారా రంద్రం మూసేసినట్లు Dr. సందీప్ రావు, సదానంద రెడ్డి ప్రకటించారు. చిన్నారికి సకాలంలో సరైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.

News September 9, 2025

NZB: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియామకం

image

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియమితులయ్యారు. ఈ అవకాశం కల్పించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించి పార్టీ ఎదుగుదలకు శాయశక్తులా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

News September 9, 2025

నవీపేట్: జార్ఖండ్‌లో యువకుడి మృతి

image

నవీపేట్ మండలం అబ్బాపూర్ తండాకు చెందిన సభావాత్ శ్రీహరి(20) జార్ఖండ్ రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాలో పోస్టల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం మిత్రులతో కలిసి నదిలో స్నానానికి వెళ్లగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సోమవారం గాలింపు చర్యలు చేపట్టగా మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.