News September 8, 2025
శరవేగంగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు

AP: గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఇంటిగ్రేటేడ్ టెర్మినల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ 6 ఎయిరో బ్రిడ్జిలు, ILBHS(inline Bagage handling system), ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ప్రత్యేకంగా నిలవనున్నాయి. అరైవల్, డిపార్చర్ ప్యాసింజర్ల కోసం వేర్వేరుగా ఎయిరోబ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తున్నారు. ILBHS వల్ల లగేజ్ వెంటనే స్కాన్ చేసుకోవచ్చు. నూతన టెర్మినల్ పనులు 70% పూర్తి కాగా, సంక్రాంతి నాటికి ప్రారంభించే అవకాశం ఉంది.
Similar News
News September 8, 2025
రూ.20 కోట్ల విలువైన వాచ్ ధరించిన పాండ్య

టీమ్ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన విలాసవంతమైన జీవనశైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. దుబాయ్‌లో జరగనున్న ఆసియా కప్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన రూ.20 కోట్ల విలువైన లగ్జరీ వాచ్ ధరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన వాచ్‌లలో ఒకటి. రిచర్డ్ మిల్లె RM 27-04 మోడల్ వాచ్‌లు ప్రపంచంలో మొత్తం 50 మాత్రమే ఉన్నాయి. ఆసియా కప్ (₹2.6CR) ప్రైజ్ మనీ కంటే వాచ్ ధర దాదాపు పది రెట్లు ఎక్కువ.
News September 8, 2025
ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలి: సుప్రీంకోర్టు

ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలని ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ ఆధార్ కార్డు జెన్యూన్‌గా ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించింది. దీనిని 12వ డాక్యుమెంట్‌గా పరిగణించాలని పేర్కొంది. బీహార్ సమగ్ర ఓటరు సర్వేపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది.
News September 8, 2025
IASల బదిలీ.. TTD ఈవోగా సింఘాల్

ఏపీ ప్రభుత్వం 11 మంది IAS అధికారులను <