News September 8, 2025
వనపర్తి: వాట్సాప్‌లో ఏపీకే ఫైల్స్‌తో జాగ్రత్త: ఎస్పీ

వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే అపరిచిత ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని ఎస్పీ రావుల గిరిధర్ ప్రజలకు సూచించారు. ఆఫర్లు, బహుమతుల పేరుతో వచ్చే ఈ ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేస్తే మీ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఫైల్స్ ద్వారా ఫోన్లలోకి వైరస్ చొరబడి డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Similar News
News September 9, 2025
నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

ఏపీలో నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ మొదలుకానుంది. విద్యార్థులు ఈనెల 12వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 10నుంచి 13వరకు జరుగుతుంది. వెబ్‌ఆప్షన్ల నమోదు 13 నుంచి 15వరకు ఉండనుంది. వెబ్ ఆప్షన్స్ 16న ఎడిట్ చేసుకోవచ్చు. 18న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 19, 20న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.
News September 9, 2025
టీటీడీ పాలకమండలి సమావేశం రద్దు

రేపు జరగాల్సిన టీటీడీ పాలకమండలి సమావేశం రద్దు అయింది. ఈఓ శ్యామలరావు బదిలీతో రేపు బోర్డు సమావేశంతో పాటు ఇవాళ జరగాల్సిన విభాగాధిపతుల సమీక్షా సమావేశం కూడా రద్దు అయింది. 700 వేదపారాయణదారుల భర్తీ ప్రక్రీయను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడు అదేశాలతో అర్హులైన బ్రాహ్మణులకు న్యాయం జరిగేలా త్వరలో పారదర్శకంగా వేదపారాయణదారులు పోస్టులను భర్తీ చేయనున్నారు.
News September 9, 2025
కార్తీక్ ఆర్యన్ ఇంట్లో శ్రీలీల పూజలు.. పిక్స్ వైరల్

డేటింగ్ రూమర్స్ వేళ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ఆర్యన్ ఇంట్లో హీరోయిన్ శ్రీలీల వినాయక చవితి పూజలు చేశారు. ఈ వేడుకలకు శ్రీలీల తల్లి కూడా హాజరుకావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య రిలేషన్ కన్ఫామ్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా కార్తీక్-శ్రీలీల కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీలో నటిస్తున్నారు.