News September 8, 2025
అక్షరాస్యతలో HYD టాప్

అక్షరాస్యతలో రాజధాని తొలి స్థానంలో కొనసాగుతోంది. 2011 గణంకాలను పరిశీలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ 83.25%తో అక్షరాస్యతలో టాప్‌లో ఉంది. మేడ్చల్ మల్కాజిగిరి: 82.49% 2వ స్థానం, హన్మకొండ-74.13% 3వ స్థానం, రంగారెడ్డి: 71.88 % 4వ స్థానంలో ఉన్నాయి. ఇక వికారాబాద్ జిల్లా అక్షరాస్యతలో 57.91%తో వెనుకబడింది. మెరుగైన సమాజం కోసం చదవండి.. చదివించండి.
నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం.
Similar News
News September 9, 2025
HYD: మోత మోగిన కరెంట్ బిల్లు.. హీటర్ కారణమే

గ్రేటర్ HYD పరిధి తార్నాక, మల్లాపూర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట సహా అనేక ప్రాంతాల్లో వాటర్ హీటర్లతో మీటర్ల రీడింగ్‌లు గిర్రుమని తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కరెంటు బిల్లు రాగా, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం ఉన్నవారికి 200 యూనిట్లు దాటింది. దీంతో కరెంటు బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి. పలువురికి రీడింగ్ ఎక్కువగా రావటానికి కారణాలు పరిశీలిస్తే, అనేక మంది అత్యధికంగా వాటర్ హీటర్లు వాడినట్లు తేలింది.
News September 9, 2025
బాలాపూర్ గణేశ్ హుండీ ఆదాయం ఎంతంటే!

బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాల హుండీని సోమవారం లెక్కించారు. తొమ్మిది రోజులపాటు భక్తులు రూ.23,13,760 కానుకలు సమర్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. 9 రోజులు లక్షలాది భక్తులు గణపయ్యను దర్శించుకున్నట్లు వివరించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన పోలీసు శాఖ, స్వచ్ఛంద కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందికి అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
News September 9, 2025
అల్లు అర్జున్‌కి షాక్.. నోటీసులు ఇచ్చిన GHMC

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనం మీద అదనపు అంతస్తు నిర్మించారంటూ GHMC అధికారులు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. అనుమతి లేకుండా నిర్మించిన ఐదో అంతస్తు ఎందుకు కూల్చోద్దంటూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రెండేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంపైన ఇటీవల అక్రమంగా నిర్మించిన విషయంపై ఫిర్యాదు రావడంతో అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.