News September 8, 2025

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ గ్రీన్‌లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 193 పాయింట్లు లాభపడి 80,904 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు వృద్ధి చెంది 24,802 వద్ద కొనసాగుతోంది. టాటా స్టీల్, ఎటర్నల్, రిలయన్స్, HDFC, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, BEL, ట్రెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, L&T, ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Similar News

News September 9, 2025

ఉప రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారంటే..

image

ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. మనదగ్గర MLC ఓటింగ్ మాదిరే ఉంటుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటో ప్రాధాన్యత ఓటు వేయాలి. తర్వాత ఇష్టమైతే మరో అభ్యర్థికి రెండో ప్రాధాన్యత వేయొచ్చు. అయితే NDA, INDI కూటమి రెండో ప్రాధాన్యత ఓటు వేయొద్దని తమ ఎంపీలకు ఇప్పటికే స్పష్టం చేశాయి. అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.

News September 9, 2025

నేటి నుంచి ఆసియా కప్ సమరం

image

యూఏఈ వేదికగా ఇవాళ్టి నుంచి ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) జరగనుంది. తొలి మ్యాచులో నేడు గ్రూప్-Bలోని అఫ్గానిస్థాన్, హాంకాంగ్ తలపడనున్నాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ టీవీ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్షం ప్రసారం చూడవచ్చు. రేపు గ్రూప్-Aలోని భారత్, యూఏఈ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.

News September 9, 2025

ఉపరాష్ట్రపతి నిర్వహించే బాధ్యతలు ఇవే

image

భారత్‌లో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి. ఈ పదవిని చేపట్టిన వారు రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ సభ సజావుగా, గౌరవప్రదంగా సాగేలా చూస్తారు. సభలో తటస్థంగా ఉంటారు. వీరు బిల్లులపై ఓటేసేందుకు వీలుండదు. ఎప్పుడైనా టై అయితే మాత్రమే కాస్టింగ్ ఓటు వేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 65 ప్రకారం ఏదైనా కారణంతో రాష్ట్రపతి సీటు ఖాళీ అయితే వైస్ ప్రెసిడెంట్ తాత్కాలికంగా రాష్ట్రపతి విధులను చేపట్టవచ్చు.