News September 8, 2025

వామ్మో: HYDలో 32 వేల టన్నుల వ్యర్థాల తొలగింపు

image

సిటీలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఇక శానిటేషన్‌పై GHMC ఫోకస్ చేసింది. నిన్నటి వరకు 20 వేల టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించింది. పారిశుద్ధ్య కార్మికులు రోజుకు 1500 నుంచి 1600 టన్నుల చెత్తను సేకరించి, జవహర్‌నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలించారు. సాగర్‌లో 12 వేల టన్నుల విగ్రహ వ్యర్థాలు బయటపడటం గమనార్హం. ప్రస్తుతం నిమజ్జన పాయింట్లు, ఊరేగింపు మార్గాలలో పనులు కొనసాగుతున్నాయి.

Similar News

News September 9, 2025

ఓయూలో నిపుణులను తయారు చేయడమే లక్ష్యం: వీసీ

image

విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేసే నిపుణులుగా తీర్చిదిద్దడమే AI, ML& డేటా అనలిటిక్స్‌లోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం లక్ష్యమని ఓయూ వీసీ ప్రొ. కుమార్‌ మోలుగరం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇంజినీరింగ్ కళాశాలకు అభినందించారు. సర్టిఫికేషన్‌ కోర్సులు, వర్క్‌షాప్‌లు నిర్వహించి మరింత ప్రాక్టికల్‌ నైపుణ్యాలు అందిస్తామన్నారు. ఇందులో ఏఐ లింక్‌ బృందం కీలకపాత్ర పోషించిందని ప్రశంసించారు.

News September 9, 2025

HYD: మోత మోగిన కరెంట్ బిల్లు.. హీటర్ కారణమే

image

గ్రేటర్ HYD పరిధి తార్నాక, మల్లాపూర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట సహా అనేక ప్రాంతాల్లో వాటర్ హీటర్లతో మీటర్ల రీడింగ్‌లు గిర్రుమని తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కరెంటు బిల్లు రాగా, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం ఉన్నవారికి 200 యూనిట్లు దాటింది. దీంతో కరెంటు బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి. పలువురికి రీడింగ్ ఎక్కువగా రావటానికి కారణాలు పరిశీలిస్తే, అనేక మంది అత్యధికంగా వాటర్ హీటర్లు వాడినట్లు తేలింది.

News September 9, 2025

బాలాపూర్ గణేశ్ హుండీ ఆదాయం ఎంతంటే!

image

బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాల హుండీని సోమవారం లెక్కించారు. తొమ్మిది రోజులపాటు భక్తులు రూ.23,13,760 కానుకలు సమర్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. 9 రోజులు లక్షలాది భక్తులు గణపయ్యను దర్శించుకున్నట్లు వివరించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన పోలీసు శాఖ, స్వచ్ఛంద కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందికి అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.